మన్యం న్యూస్ ,గుండాల: వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుండాల గ్రామపంచాయతీ కార్మికుడు ఈసం గోపయ్య(55) ఆదివారం మృతి చెందాడు. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన గోపయ్య ను కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం గోపయ్యమృతి చెందాడు.. కేసు నమోదు చేసుకున్న గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
