UPDATES  

 ఐఐటి ర్యాంకర్ కొర్స లక్ష్మీ కి రూ.33వేల ఆర్థిక వితరణ అందజేత

ఐఐటి ర్యాంకర్ కొర్స లక్ష్మీ కి రూ.33వేల ఆర్థిక వితరణ అందజేత
ఐఐటీ ఆదివాసీ విద్యార్థిని కొర్స లక్ష్మికి అన్ని విధాలు అండగా ఉంటాం:కే వి
మన్యం న్యూస్,దుమ్ముగూడెం:
ఆటా,ఎఎస్పీ,ఏవిఎస్పి ఆధ్వర్యంలో
పాట్నా ఐఐటిలో సీటు పొందిన కొర్స లక్ష్మి తల్లిదండ్రులకి ఆదివాసి టీచర్స్ అసోసియేషన్, ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ ఇంజనీరు కొర్స వెంకటేశ్వరరావు (కే వి) చేతుల మీదుగారూ33 వేల ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి కొర్స వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 1996 లోనే జూనియర్, డిగ్రీ ,ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు భద్రాచలం, వరంగల్ హైదరాబాద్ ముఖ్య కేంద్రాల్లో ప్రవేశ సీట్లు, సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ వసతి కల్పించి అనేకమంది విద్యార్థులకు ఆశ్రయం కల్పించి నేడు వివిధ ఉద్యోగ రంగంలో స్థిర పడడానికి పునాదిరాయి వేసిందని, అదే స్ఫూర్తితో నేడు అనేకమంది నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారని, ముందు ముందు ఆదివాసులకు అనేక సహాయసహకారాలు చేయుటకు కృషి చేయాలని కోరారు.కటాయిగూడెం గ్రామానికి చెందిన కొర్స లక్ష్మి పాట్నాలో ఐఐటి సీటు సంపాదించిన చదువులు తల్లికి అభినందనలు తెలియజేశారు. చాలామంది దాతలు సకాలంలో స్పందించి ఆర్థిక సహాకారాలు అందించడం శుభపరిణామం అని, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలి కోరారు.ఆదివాసి విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు మరియు వివిధ రంగాల్లో స్థిరపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయ బాబు, పూనెం శ్రీనివాస్ (రాష్ట్ర అధ్యక్షులు ఎఎస్పీ -టీ ఎస్ సోయం కామరాజు (రాష్ట్ర ఉపాధ్యక్షులు -ఎఎస్పీ -టీ ఎస్),కారం గాంధీ (ఏటిఏ సీనియర్ నాయకుడు), నూప నాగేశ్వరరావు,తెల్లం నరసింహారావు, నూప సీతయ్య, వాసం ఆదినారాయణ, వట్టం శ్రీనివాసరావు, రేసు వెంకటేశ్వర్లు, సోయం కృష్ణ, రేసు ఆదినారాయణ, తుర్రం ప్రేమ్ కుమార్, పూనెం సురేష్,సొందె మల్లూరు, కుర్సం రవి,చింత ఉపేంద్ర,ఉయిక చైత్యన కొర్స రామచంద్రయ్య, సోయం కృష్ణ వేణి,బూటారి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !