UPDATES  

 బోదబోయిన బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి

బోదబోయిన బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి
*బీ. ఆర్. ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కలిసిన ఐదు మండలాల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు

మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
వెంకటాపురం మార్కెట్ చైర్మన్ బోధ బోయిన బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని భద్రాచలం నియోజకవర్గం లోని ఐదు మండలాలబిఆర్ఎస్ మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు మణుగూరు క్యాంపు కార్యాలయంలో బీ.ఆర్.ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు,విప్ రేగా కాంతారావు ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వెంకటాపురం మార్కెట్ కమిటీ అధ్యక్షులు బొదరబోయిన బుచ్చయ్యకు భద్రాచలం టికెట్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. టికెట్ ఎవరికి కేటాయించిన బీ.ఆర్.ఎస్ శ్రేణులు ఐక్యమత్యంగా పనిచేసి అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఒకసారి చేసిన తప్పుకు భద్రాచలం స్థానం కోల్పోయామని ఇప్పటికైనా బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భద్రాచల నియోజకవర్గ పరిస్థితిపై సీఎం కేసీఆర్ కి విన్నవిస్తానని వారికి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !