అభివృద్ధికి చిరునామా రేగా
పినపాక, కరకగూడెం మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
మన్యం న్యూస్, పినపాక:
పినపాక, కరకగూడెం మండలాలలోని పలు అభివృద్ధి పనులకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.పాతరెడ్డిపాలెం, జానంపేట, మల్లారం గ్రామపంచాయతీలలో పర్యటించి సుమారు 8 కోట్ల 62 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు . జానంపేట నుండి అమరారం వరకు సుమారు 75 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని భూపతిరావుపేట నుండి ఆర్ అండ్ బి రోడ్డు నుండి వరకు సుమారు కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.మల్లారం నుండి వెంకటేశ్వరపురం వరకు సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు . గొట్టెల్ల ఆర్ అండ్ బి రోడ్డు నుండి చిన్న రాజుపేట వరకు సుమారు కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వట్టి వాగు చెరువు అనుమతులకు భగీరథ ప్రయత్నం చేశా:ఎమ్మెల్యే రేగా కాంతారావు
కరకగూడెం: వట్టి వాగు పై రూ.18 కోట్ల 60 లక్షల రూపాయలతో కొత్త చెరువు నిర్మాణం కోసం గొడుగుబండ గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొడుగు బండ వద్ద వట్టి వాగు చెరువు అనుమతుల కోసం భగీరథ ప్రయత్నం చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పినపాక నియోజకవర్గం ప్రత్యేకంగా కేటాయించిన రూ వందకోట్ల ప్యాకేజీలు మొదటి ప్రాధాన్యత వట్టి వాగు చెరువుకు ఇవ్వడం జరిగిందన్నారు . నూతన చెరువు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . వందలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లె స్వరూపాన్ని పూర్తిగా మార్చుటకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉన్నదని పల్లెల్లో ప్రగతికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు పల్లెలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందు ప్రజలు సంతోషంగా జీవనం సాగాలనేదే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమాలలో పినపాక, కరకగూడెం మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.