మన్యం న్యూస్,అశ్వాపురం:మండల కేంద్రంలో స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని…ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా అనేక విప్లవాత్మక రంగాలలో పునాదులువేసిన దివంగత నేత మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ అని అన్నారు.దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము రాఘవులు, కొండ బత్తుల ఉపేందర్, సండ్ర లక్ష్మణ్ ,బొల్లం ఐలయ్య, సబ్కా పిచ్చయ్య ,ఎస్.కె మోషన్, బొల్లినేని సురేష్, దోస పాటి చింటూ ,కోలా శస్కాంత్ ,తోట విష్ణు ,కుంజ జాను తదితరులు పాల్గొన్నారు.
