అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం
* గృహ లక్ష్మి నిరంతర ప్రక్రియ
*బీ. ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులుసోయం రాజారావు
మన్యం న్యూస్, చర్ల:
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ప్రతిష్టత్మకంగా అందిస్తున్న గృహలక్ష్మి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని బీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు అన్నారు .మంత్రి పువ్వడా,బీ. ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,విప్ రేగా కాంతారావు,భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి బాలసాని లక్ష్మీనారాయణ ల సహకారంతో మండలానికి మరిన్ని గృహలక్ష్మి పక్కా గృహాలు మంజూరు అయ్యేవిధంగా కృషి చేస్తానని అన్నారు. గృహ లక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ అని, మండల ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అని ఎటువంటి పుకార్లను నమ్మవద్దు అని ఆయన కోరారు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమం అందేలా వచ్చేస్తున్నారని అన్నారు.
