నామా ముత్తయ్య ట్రస్టు సేవలు అభినందనీయం.
గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ.
మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 20: ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు తండ్రి నామా ముత్తయ్య పేరున ఏర్పాటు చేసిన నామా ముత్తయ్య ట్రస్టు సేవలు అభినందనీయమని గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ అన్నారు. ఆదివారం మద్దుకూరు పంచాయతీలో గల ఆటోడ్రైవర్లు, పంచాయతీ పారిశుద్ద కార్మికులకు నామా ముత్తయ్య ట్రస్టు ఆద్వర్యంలో యూనిఫామ్స్ పంపిణీ వెంకటనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఆపదలో ఉన్న వారికి అండగా ట్రస్టు పనిచేస్తుందని, ఇటువంటి సేవల కొన్ని ఏండ్లుగా చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచిచేసే వారికి ఎల్లప్పుడు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పత్తిపాక వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.