కుసుమ జగదీష్ ఆశయాలు కొనసాగిస్తాం
ములుగును గెలిపిద్దాం… జగదీష్ కి కానుక గా ఇద్దాం
*కుడుముల ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణి.
మన్యం న్యూస్, మంగపేట:ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జి జడ్పీ చైర్మన్,తెలంగాణ ఉద్యమకారుడు కీ” శే “కుసుమ జగదీష్ జయంతి బీ.ఆర్.ఎస్ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
మండల పరిధిలో ని కస్తూర్బా మహిళా మండలి వృద్ధాశ్రమం లో సీనియర్ నాయకులు, మంగపేట మండల బీ. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగాకుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ… ములుగు జిల్లాలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని బి ఆర్ ఎస్ పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసిన వ్యక్తి కుసుమ జగదీష్ అన్నారు. ఏంతో భవిష్యత్ ఉన్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అందరి మధ్యలో లేకపోవడం బాధాకరం అని అన్నారు . ఆయన ఆశయ సాధనకు ప్రతి బీ.ఆర్.ఎస్ కార్యకర్త నడుం బిగించి ములుగు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసి అమరుడు కుసుమ జగదీష్ కి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండలం నాయకులు, యువత పాల్గొన్నారు.
