పూర్తి పారదర్శకతతో మద్యం దుకాణాల టెండర్లు..
జిల్లా లో 122 మద్యం షాపులు… 7207 దరఖాస్తు లు
* అత్యధిక మద్యం దరఖాస్తులలో తెలంగాణ రాష్ట్రం లో మూడవ స్థానం
*విష్ణు ఎస్ వారియర్ సీపీ
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిది:జిల్లాలో 122 మద్యం దుకాణాల కు సంబంధించి సోమవారం ఖమ్మం సిక్వెల్ రిసాట్ లో అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించినట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.122 మద్యం దుకాణాలకు సంబంధించి 7,207 దరఖాస్తులు రాగా,ఇవి తెలంగాణ రాష్ట్రంలో మూడో స్థానంఅని తెలిపారు.
ఎవరికి ఎలాంటి ఇబ్బంది, అనుమానం లేకుండా వీడియోగ్రఫీ చేయించడం, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా అందరికీ తెలిసే విధంగా లాటరీ నిర్వహించడం చెయ్యడం జరిగిందని, అంతేకాక దుకాణాలు పొందినవారికి అప్పటికప్పుడే ఉత్తర్వులు సైతం అందజేసిన్నట్లు ఆయన వెల్లడించారు. టెండర్ల ప్రక్రియ సజావుగా సాగడానికి150 పోలీసులు సిబ్బంది, అలాగే ఫైర్,మెడికల్ సిబ్బంది ని నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్ ఆదర్శ్ సురభి,జేసీ నాయక్ , పోలీస్ , ఎక్సైజ్ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.