రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం
* తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
* కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం అని
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశం జరిగింది.
సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటలోని పలు వార్డుల నుంచి బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి పొంగులేటి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ జాబితా లాగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఉండదన్నారు. ప్రజా ఆశీస్సులు, దీవెనలు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుని, అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుందని తెలిపారు. కేసీఆర్ డిమాండ్ చేశాడనో, ఆయన దీక్ష చేశాడనో తెలంగాణను సోనియమ్మ ఇవ్వలేదన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి వారి ఆత్మగౌరవాన్ని అగౌరవపరచొద్దనే సద్దుదేశ్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉకంటి గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, నాగ సీతారాములు, ముత్తయ్య, శివారెడ్డి, మోహన్ రావు, కనకరాజు, రామలక్ష్మణ్, రామనాథం, భద్రయ్య, చింతలపూడి శేఖర్
తదితరులు పాల్గొన్నారు.