ప్రభుత్వ విప్ రేగాకు టిక్కెట్ ఖరారుతో అంబరాన్నంటిన సంబరాలు
శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 21
బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి గా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తో మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి వాతావరణం ఏర్పడింది.ప్రజాప్రతినిధలు,కార్యకర్తలు పండుగా లా సంబురాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావును కూనవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏనిక ప్రసాద్,ఎంపీటీసీల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు,కలిసిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూనవరం గ్రామ శాఖా అద్యక్షులు వెంకట్రావు,టిబిజికెఎస్ మణుగూరు బ్రాంచ్ నాయకులు కాప శివాజి,నాయకులు బర్ల సురేష్,ఎండి వహీద్,రామరాజు, వంకా అర్జున్ రావు,వంకా సూరయ్య,తదితరులు పాల్గొన్నారు.