సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుకు ఐదు స్థానాలను బి ఆర్ ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి అడిగిందే తడవుగా వేలకోట్ల నిధులు ముఖ్యమంత్రికి కేసీఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఐదుకు ఐదు స్థానాలు కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వడం ఖాయమన్నారు. జిల్లావ్యాప్తంగా బీ.ఆర్.ఎస్ శ్రేణులు ఐక్యమత్యంగా పనిచేసే తమ తమ నాయకులను గెలిపించుకోవాలని సూచించారు.
