UPDATES  

 చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోండి: ఎస్పీ డాక్టర్ వినీత్.జి

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డా.వినీత్.జి
నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా పోలీసు అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి రవాణా, మట్కా, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, డిఎస్పీలు వెంకటేష్, రమణ మూర్తి, రాఘవేంద్రరావు, రెహమాన్, మల్లయ్య స్వామి జిల్లాలోని సిఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !