మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రదర్శనగా బయలుదేరి బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని జై కేసీఆర్.. జై వనమా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అదేవిధంగా పాల్వంచ పట్టణంలో కూడా వనమా అభిమానులు జై వనమా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసి సంబరాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాకు టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపీపీలు బాదవత్ శాంతి, సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు నెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.