మన్యం న్యూస్ గుండాల, అల్లపల్లి: పినపాక నియోజకవర్గం అభ్యర్థిగా మరో మారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావును పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించడంతో మణుగూరు క్యాంపు కార్యాలయంలో ఆయనను సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి రేగాను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి బాబా, అధ్యక్షులు వెంకటేశ్వర్లు,విభాగం అధ్యక్షులు సతీష్, పార్టీ నాయకులు ఆరిఫ్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు
