మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- సోమవారం మణుగూరు గిరిజన భవనంలో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బిసి (వెనుకబడిన తరగతుల) కుల చేతివృత్తిదారులకు 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా బూర్గంపహాడ్ మండలానికి చెందిన 40 మందికి పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా చెక్కులు పంపిణి చేయటం జరిగింది,ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల సర్పంచులు,మండల నాయకులు,యువజన నాయకులు,ఎంపిడిఓ వివేక్ రామ్ మండల అధికారులు,బిఆర్ఎస్ నాయకులు,తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.