*రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుని అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత
*మన్యం న్యూస్,ఇల్లందు*:ఇల్లందు మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డుకు చెందిన రాహుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్మంగళవారం రాహుల్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి మనోదైర్యాన్ని అందించారు. అనంతరం జరిగిన రాహుల్ అంతిమయాత్రలో మడత పాల్గొన్నారు.
