UPDATES  

 భద్రాచలం లో గెలుపు బిఆర్ఎస్ దే

భద్రాచలం లో గెలుపు బిఆర్ఎస్ దే
*మండల అధ్యక్షులు సోయం రాజారావు

*తెల్లం టికెట్ పై హర్షం వ్యక్తం చేస్తున్న మండల అధ్యక్ష కార్యదర్శులు…

*టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న బీ. ఆర్.ఎస్ కార్యకర్తలు

మన్యం న్యూస్ చర్ల:
ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ తెల్లం వెంకట్రావు ను ప్రకటించిన సందర్భంగా చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మండల కమిటీ తరపున టపాసులు కాల్చి స్వీట్లు పంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోయం రాజారావు మాట్లాడుతూ… భద్రాచలం నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ఏది చేసినా ఒక సంచలనం అని,కెసిఆర్ కు ఇంకెవ్వరూ సాటిరారు పోటీలో లేరని, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం మొదలుకొని రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టే దిశగా అడుగులు వేస్తు సిట్టింగ్ లనే 115 మంది అభ్యర్థులను ప్రకటించినందకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు, ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోటమల్ల వరప్రసాద్, కార్మిక విభాగం నాయకులు ఇర్ఫ వసంత్, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, సీనియర్ నాయకులు అజిత్ తాతారావు, తాతారావు, తోటమల్ల రవి, కొంబత్తిని రాము, తడికల బుల్లేబ్బాయి, అంబోజి సతిష్, దుబ్బ సమ్మయ్య, రావుల కిషోర్, గోరింట్ల వెంకటేశ్వరవు, రేగల్ల సుధాకర్, బోల్ల వినోద్, సిద్ది సంతోష్, పవన్, కొంగూరి రాజా, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !