విస్తృతంగా వాహన తనిఖీలు. మన్యం న్యూస్ ,వాజేడు: మండలంలో చెరుకూరు గ్రామం పరిధిలో 163 వ జాతీయ రహదారి పై మంగళవారం ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన దృవపత్రాలను పరిశీలించి వాహనాలలో అనుమానితులుగా ఎవరైనా కనిపిస్తే వారి వివరాలు తెలుసుకున్నారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు.చట్టం ఉల్లంఘన చేసి వాహనాలు నడిపినవారిపై జరిమానాలు తప్పవని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్స్, తదితరులు పాల్గొన్నారు.
