తెల్లం కు సీటు… కేక్ కట్ చేసి యువత సంబరాలు
*డా. తెల్లం ఆధ్వర్యంలో భద్రాచలం పై గులాబీ జెండాఎగిరేస్తాం
*తెల్లంకు పూర్తి మద్దతు:చర్ల యువత
మన్యం న్యూస్,చర్ల:
భద్రాచలం నియోజకవర్గం బి.ఆర్.ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు కు ఎమ్మెల్యే అభ్యర్థి గా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో చర్ల మండల యువత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా యువ నాయకులు బోళ్ల వినోద్ మాట్లాడుతూ భద్రాచలం ఎమ్మెల్యే గా తెల్లం వెంకట్రావు గెలుపు ఖాయమని, తెల్ల వెంకటరావు విజయం కొరకు యువత పాత్ర పూర్తిస్థాయిలో ఉంటుందని అన్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా యువతను ఏకం చేస్తాం అని అన్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ప్రయాణికులకు కేకును పంచి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, రామగిరి అరుణ్, పీసా సంఘం ఉపాధ్యక్షుడు పూజారి సతీష్, శివ, సాగర్, పవన్, సంతు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
