ఆదివాసీల ఆధ్వర్యంలో తహసీల్దార్ వీరాస్వామి కి ఘనసన్మానం.
మన్యం న్యూస్, మంగపేట.
మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన బైరి విరస్వామి కి మండలంలోని ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. అనంతరం గిరిజన చట్టాలను అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన మండల అధ్యక్షుడు పోలబోయిన ఆదినారాయణ, తుడుం జిల్లా నాయకులు అన్నేబోయిన సమ్మయ్య, ఆదివాసి జిల్లా రైతు సంఘ అధ్యక్షులు తొలెం నర్సింగరావు, మండలానికి చెందిన గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.
