మలిపెద్ది వీరయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం ఎస్సీ కాలనీకి చెందిన మల్లిపెద్ది వీరయ్య 75 సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సొమయ్య,బైరిచెట్టి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
