అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధి కరకగూడెం గ్రామనికి చెందిన మొహమ్మద్ ఇజహార్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పటల్ లో చికిత్స తిసుకోని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అలాగే అదే గ్రామానికి చెందిన షేక్ మొహమ్మద్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో వారి నివాసానికి వెళ్లే పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న మృతి చెందిన దాసరి.లక్ష్మినారాయణ (55) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగా కాంతరావు,నాయకులు బుడగం రాము,రేగా అనుచరులు గుమ్మడి వల్లి ప్రసాద్, పూజరి కృష్ణ యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
