సీఎం కేసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ ఏనిక.ప్రసాద్
మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 23
తెలంగాణ లో దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీకి బుధవారం సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఏనిక.ప్రసాద్ మాట్లాడుతూ,4016 రూపాయలు పెన్షన్ ఇచ్చి వికలాంగుల జీవితాలలో సీఎం కేసిఆర్ వెలుగులు నింపారు అన్నారు.కూనవరం గ్రామ పంచాయతీ ప్రజల తరుపున సీఎం కేసిఆర్ కు సర్పంచ్ ఏనిక.ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.