జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్
మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో సెప్టెంబర్
9న జరిగే జాతీయ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ తెలిపారు. బుధవారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమీక్ష సమావేశంలో వాటిల్ వసంత్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలిపారు. మోటార్ వాహన ప్రమాద బాదితుల కేసులలో కక్షిదారులకు న్యాయం జరగాలని సూచించారు. లోక్ అదాలత్ లో రాజీపడటం వలన కక్షిదారులకు సమయము డబ్బు వృధా కాజాలదని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్ సివిల్ మనోవర్తి మోటార్ వాహన ప్రమాద కేసులు బ్యాంకు కేసులను పరిష్కరించుకొనుట కొరకు కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ.నీరజ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ.సుచరిత, కొత్తగూడెం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డి.రమేష్, జనరల్ సెక్రెటరీ రావిలాల రామారావు, జాయింట్ సెక్రెటరీ కాసాని రమేష్, మక్కడ్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, సీనియర్ న్యాయవాదులు పలివెల సాంబశివరావు, కిషన్ రావు, శివరాం ప్రసాద్, ఎస్వి రామారావు, బాగం మాధవరావు, ఇన్సూరెన్స్ కు సంబంధించి సీనియర్ న్యాయవాదులు కొత్తపల్లి రామారావు, గాదే రామచంద్ర రెడ్డి, రావి విజయ్ కుమార్, అంబటి రమేష్, మెండు రాజమల్లు, పాల రాజ శేఖర్, అరకాల రవికుమార్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.