ఇళ్ల మధ్యలో మురుగునీరు
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 23: అశ్వారావుపేట పంచాయతీ కార్యాలయం సమీప వీధిలో శ్రీ సత్యసాయి కల్యాణమండపం ఎదురుగా ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలంలో మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతోంది. అంతేగాక దోమల వృద్ధికి నిలయంగా మారడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ వారు స్పందించి మురుగు నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మురుగునీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని స్థలం యజమానికి నోటీసులు జారీ చేస్తామని పంచాయితీ కార్యదర్శి హరికృష్ణ తెలియజేసారు.