చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించిన ఐఎఫ్టియు నాయకులు.
మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్ట్ 29న హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలను అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి ఇల్లందు మండలం పొలారంలో బుధవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, జిల్లా నాయకులు జటంగి వెంకన్న, పందిర్లపల్లి వీరన్న, ఎల్. రాజు, డి రవి హచ్చ, భీముడు, రమేష్, సతీష్, లక్ష్మి, బంగారి, హమాలి, జిపి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.