ప్రపంచం చూపు భారత దేశం వైపు ఎంపీపీ జల్లిపల్లి
చంద్రయాన్ 3 విజయవంతం ఐనా సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ జల్లిపల్లి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 23: కోట్లాది భారతీయులతో పాటు యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం చంద్రయాన్ -3 వ్యమనౌక చంద్రుడి దక్షణ ధృవం పై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన తరుణం. అంతరిక్ష యవనిక పై త్రివర్ణ పతాకం రెపరెపలాడిన వేళ భారతదేశం గర్వించ దగ్గ సమయాన భూమి, చంద్రుని మధ్య దూరం దాదాపు 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేడు చంద్రుడిపై దిగిన చంద్రయాన్ -3 విజయవంతానికి కష్టపడిన శాస్త్రవేత్తలకు, దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి.