తెల్లం కు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు
మన్యం న్యూస్ చర్ల:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పేరును ప్రకటించిన సందర్భంగా చర్ల మండల బిఆర్ఎస్ నాయకులు భద్రాచలంలోని వారి హాస్పిటల్ కు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాతారావు, కార్మికశాఖ అధ్యక్షులు ఇర్ప వసంత్, మండల కమిటీ నెంబర్ కొంబతిని రాంబాబు, మండల కమిటీ నెంబర్ సిద్ది సంతోష్, యువ నాయకులు తడికల అబ్బాయ్, అంబోజీ సతీష్, రావుల కిషోర్, గంపల రమేష్ కొంగూరి వెంకటేశ్వర్లు,సిద్ది కిరణ్, తడికల చంద్రశేకర్, తడికల వెంకటేశ్వర్లు, పులగడప కిరణ్, తదితరులు పాల్గొన్నారు.