మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరికి ఘన స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన అశ్వారావుపేట టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు బూసి పాండురంగ, సీనియర్ నాయకులు సిరినేని వెంకయ్య, మల్లం కృష్ణయ్య, మైనారిటీ సెల్ చంద్రుగొండ మండల అధ్యక్షులు ఎస్కె అన్వర్ హుసేన్, యువజన కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎస్కె బషీర్, యువజన నాయకులు దాసరి రవి, పటేల్, వసీమ్ తదితరులు పాల్గొన్నారు.