కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం…. యూత్ కాంగ్రెస్
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 23::
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యం అని యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. దుమ్ముగూడెం మండలంలోని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు చింతిరాల సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ,కౌలు రైతులకు రూ.15000, భూమిలేని నిరుపేదలకు రూ.12000 ఇచ్చే కార్యక్రమాలను చేపెట్టబోతుందని ప్రజలకు వివరించారు. అదేవిధంగా అధికారంలోనికి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే కార్యక్రమాన్ని, నిరుద్యోగులకు 4, 000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తారని, ఇళ్ల స్థలాలున్న వారికి ఐదు లక్షలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్, మండల యూత్ అధ్యక్షులు కోడి చంటి, భద్రాచలం యూత్ కాంగ్రెస్ నాయకులు మణికంఠ, శ్యామ్, లంక శివ, తదితరులు పాల్గొన్నారు.