రైతుల పట్ల విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తగదు
ఆరు నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కరించని అధికారులు
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల పరిధిలోని సుబ్బంపేట గ్రామపంచాయతీలో ఆరు నెలల క్రితం ఒక చెట్టు నరకటం వల్ల పక్కనున్న కరెంటు స్తంభం మీద పడిపోవడం జరిగింది. స్థానిక రైతులు విద్యుత్ అధికారుల వెంట మూడు నెలలు తిరిగితే కరెంటు స్తంభం వేశారని, కానీ ఈరోజుకి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని బిగించడం జరగలేదని, ఆ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని నమ్ముకొని బావులకి మోటార్లు తగిలించి 20 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నామని అన్నారు. నేటికీ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల చాలా నష్టపోయం అని ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని బిగించి ఉపయోగం లోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరారు.