* విద్యాశాఖ అధికారుల పైన ఐటీడీ ఏ చర్యలు తీసుకోవాలి *విద్యా కమిటీ తీర్మానం
**మూడు నెల్లుగా విద్యకు దూరం చేసిన అధికారుల జీతాలు వెనక్కి తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్*
*సొంత డబ్బులతో వాలంటీర్ ని ర్పాటు చేస్తూ తీర్మానం*
*ఏజెన్సీ విద్య పైన సోయి లేని ఎమ్మెల్యే*
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో
బుధవారం పర్శిక గూడెం గిరిజన ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల తల్లి తండ్రుల సమావేశం సర్పంచ్ నర్సింహా మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. పర్శిక గూడెంపాఠశాలలో 17 మంది గిరిజన విద్యార్థులు ఉంటే ఒకే ఉపాద్యాయుడు బోదిస్తే చదువు ఎలా వస్తుందని, ఈ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు పంపించడం పైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల సామర్ధ్య్యాలను సర్పంచి నర్సింహా మూర్తి పరీక్షించారు. చదవడం రాయడం లో వెనకబడి ఉన్నట్టు గమనించారు. పాఠశాల విద్యాకమిటి చైర్మన్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ లకు కు తెలియకుండా పాఠశాల ఉపాద్యాయుడు అయిన అట్టం దామోదర్ ని ఎస్. ఈ. ఆర్. పి, గా బయటికి పంపించడం విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్లుఅవుతుందని. పేర్కొన్నారు. ఐటీడీ ఏ విద్యా శాఖా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుడిని తమ ఇష్టానుసారంగా పంపించినందుకు గాను వారి పైన శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని, గిరిజన సంక్షేమ శాఖా కార్యదర్శిని కోరుతూ తీర్మానము చేశారు. పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ
న్నట్లు కమిటీ భావించింది. అదేవిధంగా చిరుతపల్లి జి పి ఎస్ పాఠశాలలోని 49 మంది విద్యార్థుల తల్లితండ్రులు సమావేశం లొ సర్పంచ్ నర్సింహా మూర్తి ఆధ్వర్యంలో తమ సొంత డబ్బులతో ప్రత్యేకంగా విద్యా వాలంటీర్ ని ఏర్పాటు చేసుకున్నట్లు మరో తీర్మానం చేశారు. ఒక్కో విద్యార్థి కుటుంబం నెలకు 150 రూపాయలు, సర్పంచి 500 వందల రూపాయలు చందా వేసుకొని , నెలకు ఆరు వేల రూపాయలు వేతనంగా చెల్లించనున్నట్లు తీర్మానం లో పొందు పరిచారు. విద్యా వాలంటీర్ గా నల్లేబోయిన గోవర్ధన్ నియమించారు. అనంతరం సర్పంచ్ నర్సింహా మూర్తి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందక పోవడం వల్లనే విద్యలో రానించలేక పోతున్నట్లు తెలిపారు. గిరిజన సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేసి, గిరిజన విద్యకు నీళ్లు వొదులు తున్నట్లు విమర్శలు గుప్పించారు.ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ ప్రభుత్వం స్వాహా చేస్తున్నప్పటికీ గిరిజన ఎమ్మెల్యే లకు ఏ మాత్రం సోయి లేదన్నారు. రిజర్వేషన్ తో గెలుపొందిన శాసన సభ్యులు పోదేం వీరయ్య గిరిజన ప్రాంత విద్య పైన దృష్టి పెట్టక పోవడం వల్ల ఆదివాసీలు మరింత దోపిడీ, దౌర్జన్యాలకు గురి అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు చదువు కుంటే తమ హక్కులు,చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని నాణ్యమైన విద్యను అందివ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యను పొందటం విద్యార్థుల హక్కు అన్నారు. ఆ హక్కులను పాలకులు, ప్రభుత్వ అధికారులు హరిస్తున్నారని మండిపడ్డారు. చిరుతపల్లి, పర్శిక గూడెం పాఠశాలల తల్లి తండ్రుల సమావేశం లో చేసిన రెండు తీర్మానలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ట్రైబల్ కమిషనర్ కి పంపిస్తున్నట్లు తెలిపారు.