మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్టు 24
మణుగూరు మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు తల్లికి ఆరోగ్యం బాగోలేదని,హైదరాబాద్ లోని ఆర్టీసీ హాస్పిటల్ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా రేగా సుధారాణి మాట్లాడుతూ, అధైర్య పడకండి అమ్మ అండగా ఉంటాం అని వారికి భరోసా కల్పించారు.వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లను రేగా సుధారాణి కోరారు.