UPDATES  

 కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

 

మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఆగస్టు 24: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని అంకమ్మతల్లి ఆలయ సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో గురువారం మాజీ ఎమ్మెల్యే,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వర్గాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.అన్నపురెడ్డిపల్లి మండలంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని,ఎవరు అడగకుండానే అన్నపురెడ్డిపల్లి మండలం చేయాలని ఆనాడు సీఎంని ఒప్పించి ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.ఈ మూడు నెలలు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చెయ్యాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో చండ్రుగొండ జడ్పిటిసి వెంకటరెడ్డి,చెరుకూరు రవి,దోసుపాటి రాంబాబు,కుంజ శ్రీను,పెద్దారపు నాగరాజు,చల్లా రమేష్ ,ఇనపనూరి రాంబాబు,వీరబోయిన వెంకటేశ్వర్లు, వీరబోయిన నాగేశ్వరరావు,యాదల వెంకన్న కాంగ్రెస్ నేతలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !