UPDATES  

 తెలుగోడి జెండా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ హీరో

తెలుగోడి జెండా అల్లు అర్జున్

నేషనల్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ హీరో

69ఏళ్ల జాతీయ ఫిలిం అవార్డులలో నవ చరిత్ర

ట్రిపుల్ ఆర్, పుష్ప, ఉప్పెనలకు అవార్డుల పంట

మన్యంన్యూస్ ప్రత్యేక ప్రతినిధి
69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ సత్తా చాటారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ‘బెస్ట్ యాక్టర్ మేల్’ క్యాటగిరీలో అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇంతవరకూ ఏ ఒక్క నటుడికి కూడా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు రాలేదు. అయితే ఈసారి బన్నీ జాతీయ అవార్డు అందుకొని తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పారు. బెస్ట్ తెలుగు ఫిల్మ్ విభాగంలో ఉప్పెనకు అవార్డు వరించింది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్, బెస్ట్ కొరియాగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేల్ సింగర్, బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ జాతీయ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్ (కొండపొలం)కు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్ఆర్) కు గానూ కీరవాణికి జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ఆర్ఆర్ఆర్ కి అవార్డు వచ్చింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమాచార్యులకు నేషనల్ అవార్డు దక్కింది.

తెలుగు సినిమాలకు ఈసారి మొత్తం 10 జాతీయ అవార్డులు వచ్చాయి. అల్లు అర్జున్ కు జాతీయ పురస్కారం రావడంతో ఆ ఘనత సాధించిన తొలి హీరో అని అభివర్ణిస్తున్నారు. ఈసారి ఉత్తరాదితో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమకే అత్యధిక అవార్డులు రావడం విశేషం.

ఉత్తమ జాతీయ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప – ది రైజ్)
ఉత్తమ జాతీయ నటి (ఇద్దరు) – అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్‌ (మీమీ)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్

తెలుగు వారికి వరించిన అవార్డులు
బెస్ట్ తెలుగు ఫిల్మ్ – ఉప్పెన
బెస్ట్ మ్యూజిక్ (సాంగ్స్) – దేవిశ్రీ ప్రసాద్
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డ్ – ఆర్ఆర్ఆర్ (కింగ్ సోలోమన్)
బెస్ట్ కొరియోగ్రఫీ – ఆర్ఆర్ఆర్ (ప్రేమ్ రక్షిత్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – ఆర్ఆర్ఆర్ (వి.శ్రీనివాస్ మోహన్)
బెస్ట్ మేల్ సింగర్ – ఆర్ఆర్ఆర్ (కాలభైరవ)
బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ – ఆర్ఆర్ఆర్ (కీరవాణి)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – ఆర్‌ఆర్‌ఆర్‌ (రాజమౌళి)
బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్ (కొండపొలం)

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !