UPDATES  

 కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ * రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్
* రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
కోల్ బెల్ట్ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టడమే కాకుండా అభివృద్ధికి కావాల్సిన నిధులు వరదల పారిస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 75.25 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 139 పనులకు పాల్వంచ మున్సిపాల్టీలోని 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 268 పనులకు మంత్రి శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగూడెం అంటే సీఎం కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉందన్నారు. అందుకే కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేటాయించి ప్రత్యేకంగా వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు
చేస్తున్నారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం-పాల్వంచ నగరాలను హైదరాబాదు-సికింద్రాబాద్ జంటనగరాల్లాగా విరాజిల్లే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 135 కోట్ల రూపాయలతో ఇంత
పెద్దఎత్తున అభివృద్ధికి శ్రీకారం చుట్టిన దాఖలాలు లేవని నేడు ఇదొక చరిత్ర అని చెప్పారు. ఒకప్పుడు కొత్తగూడెం
ఏ విధంగా ఉండేదో, నేడు ఏ విధంగా ఉందో చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అడిగిన వెంటనే నిధులు ఇస్తున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే వనమా
అభివృద్ధికి కావలసిన నిధులను అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 135 కోట్ల రూపాయలతో
చేపట్టిన అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసినట్లు చెప్పారు. కిన్నెరసాని జలాలు, మున్సిపాల్టీలలో సెంట్రల్
లైటింగ్ డ్రైనేజి మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పి వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, డిఆర్డిఓ మధుసూదన్రాజు, ఆర్ అండ్ బి ఈఈ భీంల, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !