మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణా ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం గత ఐదురోజులనుంచి ఇల్లందుమున్సిపాలిటీ పరిధిలో గడపడపకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టి పట్టణంలోని 3,6,11 వార్డులలో భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య గురువారం విస్తృతప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టటం తధ్యమని, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిల సారథ్యంలో పేదలకు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం కచ్చితంగా అమలుచేసి తీరుతుందని కనకయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియేలు, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యదల్లపల్లి అనసూర్య, మండల అధ్యక్షులు పులిసైదులు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మైనారిటీ అధ్యక్షులు మసూద్, మున్సిపల్ కౌన్సిలర్ పత్తి స్వప్న, ఎస్సీ,బీసీసెల్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, శంకర్, ఎస్టీసెల్ అధ్యక్షులు వీరూ, సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, జీవీ భద్రం, సర్పంచులు పాయం స్వాతి, పాయం లలిత, కల్తీ పద్మ, ఎంపీటీసీలు మండల రాము, సురేందర్, నాయకులు సాంబమూర్తి, బోళ్ల సూర్యం తదితరులు పాల్గొన్నారు.