మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులకు కౌన్సిలింగ్ ను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గైరుహాజరవుతున్న ప్రతి ఉద్యోగుల ఇంటింటికి వెళ్లి కౌన్సిలింగ్ కి హాజరు కావాలని కోరుతూ పత్రాలు ఇవ్వడం జరిగింది. 2023 సంవత్సరంలో 01.01.2023 నుండి 31.07.2023 వరకు 50 మస్టర్ కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులకు ఈనెల 28వ తేదీన ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ లో హాజరైన వారి గత సంవత్సరములలో చేసిన హాజరులను నాగాలకు సంబంధించిన విషయాలను గూర్చి విశ్లేషించడం, ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ప్రకటనలో తెలిపారు.