అక్రమంగా కలప రవాణా….. పట్టుకున్న అటవీ శాఖ అధికారులు
యదేచ్చగా పట్టపగలే కలప అక్రమ రవాణాకు పూనుకున్న దుండగులు
మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ రేంజ్ పరిధిలో కుర్నపల్లి అటవీప్రాంతం నుండి ట్రాక్టర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 53 టేకు చెక్కలను చింతగుప్ప గ్రామ చివరిలో అడవి శాఖ అధికారులు పక్క సమాచారంతో పట్టుకోవడం జరిగింది.అటవీ శాఖ అధికారుల రాకను గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ అక్కడే ట్రాక్టర్ ను వదిలి పరారయ్యాడు. అనంతరం తమ సిబ్బంది ద్వారా ట్రాక్టర్లు లో ఉన్న 53 టేకు చెక్కల తోపాటుగా ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని చర్ల కేంద్రాల్లోని అటవీశాఖ కార్యాలయానికి తరలించడం జరిగిందనీ డిప్యూటీ రేంజ్ అధికారి బి అచ్చయ్య నాయక్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ 53 టేకు చెక్కల విలువ 73,957 ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి రవీందర్, కె భద్రయ్య, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.