మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ కోసం శుక్రవారం హైదరాబాదులోని గాంధీభవన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలానికి చెందిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగ సీతారాములు మాట్లాడుతూ
తాను చేస్తున్న ప్రజాసేవను చూసి టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉకంటి గోపాలరావు, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలాపూడి రాజశేఖర్, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, మారెబోయిన హరిబాబు, ఆకునూరి కనకరాజు, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరీం పాషా, కేశబోయిన నర్సింహారావు, చిమట నాగేశ్వర్రావు, బొల్లం ఉదయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ టికెట్ కోసం లక్కినేని దరఖాస్తు..
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు లక్కీనేని సురేందర్ రావు గాంధీభవన్లో శుక్రవారం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దరఖాస్తు పాటుగా దరఖాస్తుతో పాటుగా యాభై వేల రూపాయల డిడిని గాంధీ భవన్ లో సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్ రావు, ఆళ్ళ మురళి, తుమ్ చౌదరి, నాగేంద్ర త్రివేది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.