రేగాపై మాట్లాడే స్థాయి నీది కాదు చందా సంతోష్
*బీఆర్ఎస్ పార్టీ అశ్వాపురం మండల యూత్ అధ్యక్షుడు గద్దల రామకృష్ణ.
మన్యం న్యూస్,అశ్వాపురం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ నాయకులు చంద్ర సంతోష్ కి లేదని టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన శుక్రవారం అశ్వాపురంలో విలేకరులతో మాట్లాడారు. చందా సంతోష్ స్థాయి మరిచి మాట్లాడితే తగిన మూల్యా చెల్లించుకోవాల్సి ఉంటుందని ఘాటు హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక గొడవలు సృష్టిద్దామని ఆలోచన చేస్తున్నది కాంగ్రెస్ నాయకులు అని అన్నారు.
