మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ ఓటును పరిశీలన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27వ తేదీలలో జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా పరిశీలనకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని ప్రతి ఓటరు తప్పని సరిగా తన పేరును పరిశీలన చేసుకోవాలని చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు కానీ మార్పులు చేర్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నిర్దేశిత ఫారాలలో దరఖాస్తు చేయాలని చెప్పారు. సలహాలు, సూచనలు కొరకు బుతుస్తాయి అధికారులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ పరిశీలన కార్యక్రమంలో బాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 1.10.2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
స్కాలర్ షిప్ ల కొరకు ధరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్ధులకు(ముస్లిం క్రిస్టియన్ సిక్కులు జైనులు బౌద్ధలు పార్సీలు) ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకానికి (సీయం ఓవర్సిస్ స్కాలర్ షిప్)ల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఈ పథకానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యలో పిజి కోర్సులలో విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొంది ఉండాలని చెప్పారు. అర్హతలు గల విద్యార్థులు ద్రువపత్రములతో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుండి దరఖాస్తు చేయుటకు అనుమతిచ్చారని చివరి తేది వచ్చే నెల 21 వరకు ఉన్నట్లు చెప్పారు. అర్హత గల మైనారిటీ విద్యార్ధులు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసిన ప్రతులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో రెండు పాస్ ఫోటోలతో రెండు సెట్లు జిరాక్సు ప్రతులను అందచేయాలని చెప్పారు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్ధులకు 20 లక్షల రూపాయలు విమాన ప్రయాణ ఖర్చులు క్రింద 60 వేలు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. అర్హులైన ఆసక్తి కలిగిన మైనారిటి విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగరచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్ లోని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం జి12 మొదటి అంతస్తులో సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు.