మన్యం న్యూస్ పాల్వంచ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాధపురం గ్రామంలో మధ్య ఉన్న కనకదుర్గ దేవస్థానము(పెద్దమ్మగుడి)లో శుక్రవారం అమ్మవారికి పంచామృతములతో వైభవముగా అభిషేకము నిర్వహించడం జరిగింది. ముందుగా మేళతాళాలతో దేవస్థాన అర్చకులు భక్తులు జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పంచామృతాలు పసుపు కుంకుమ గాజులు హారతి అందించారు. అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం పంచ
హారతులు నివేదన నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రావణ శుక్రవారమును పురస్కరించుకొని ప్రత్యేక కుంకుమపూజలు వరలక్ష్మీ వత్రం సైతం నిర్వహించారు. భక్తులు పూజలలో పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా టిపిసిసి నియోజకవర్గ ఇన్చార్జీ ఎడవల్లి కృష్ణ దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలమండలి అధ్యక్షులు మహిపతి రామలింగం, సభ్యులు ఎస్విఆర్కె ఆచార్యులు, సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, చింతా నాగరాజు, గంధం వెంగళరావు, సంకా
వెంకట రామారావు, పాయం పాపయ్య దొర, అర్చకులు, సిబ్బంది, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఒరిస్సా ఎమ్మెల్యే..
కనకదుర్గ దేవస్థానము(పెద్దమ్మతల్లి)గుడిలో అమ్మవారిని ఒరిస్సా శాసనసభ్యులు ముఖేష్ మహాలింగం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనంతో పాటు
అమ్మవారి శేషవస్త్ర ప్రసాదంను అందించారు.