29న చలో హైదరాబాదును జయప్రదం చేయండి
ఇప్ట్యూ జిల్లా కార్యదర్శి కొక్కు సారంగపాణి మన్యం న్యూస్,ఇల్లందు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మికవ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 29న చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఇప్ట్యూ నాయకులు కోక్కు సారంగపాణి, ప్రసాద్ లు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఇప్ట్యూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన ఇల్లందు, టేకులపల్లి, గుండాల ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ..కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేందుకు కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను తీసుకొస్తుందని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుందని విమర్శించారు. మోటార్, హమాలి కార్మికులకు సంక్షేమబోర్డును ఏర్పాటుచేయాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పెంచి పర్మనెంట్ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికసమస్యల పరిష్కారం కొరకు ఆగస్టు 29న చలో హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికులందరూ కదిలి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలి ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పందిర్లపల్లి వీరన్న, యాసారపు వెంకన్న, మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి తొగర సామెల్, ఉపాధ్యక్షులు రామిశెట్టి నరసింహారావు, నాయకులు బొర్ర బిక్షం, గడ్డం నాగేష్, మెంతిని నాగేష్, బాల్య కిరణ్, గంగారపు కోటయ్య, రాజు, ఎస్కే. సైదులు తదితరులు పాల్గొన్నారు.
