మన్యం న్యూస్ గుండాల: చర్ల మండలం కేంద్రంలోని గోదావరి వరదతో ముంపుకు గురైన బాధితులు 117 సర్వే నెంబర్లు ఇండ్ల నిర్మాణం కోసం గుడిసెలు వేసుకున్న వారిపై చర్ల పోలీసులు పీకేయటమే కాక దాడి చేయడానికి ఖండిస్తున్నామని ప్రజా పందా మండల కార్యదర్శి కొమరం శాంతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 గ్రామాలకు చెందిన 300 మంది వరద బాధితులు గుడిసెలు వేసుకుంటే వారిపై దౌర్జన్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. బాధితులకు మద్దతుగా నిలిచిన పార్టీ నాయకులపై కేసు పెట్టడం సరైనది కాదన్నారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకొని వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈసం కృష్ణ , సనప కుమార్ పాల్గొన్నారు
