UPDATES  

 రణరంగంగా మారిన వాగోడుగూడెం పోడు భూముల సమస్య కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఆదివాసీల మీద ఫారెస్ట్ సిబ్బంది దాస్టికం

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 25: అశ్వారావుపేట మండలం పరిదిలోని, వాగొడ్డు గూడెం గ్రామంలో శుక్రవారం ఫారెస్ట్ అధికారులకు పోడి సాగుదారులకు వివాదం చోటు చేసుకుంది. ఐటీడీఏ పీవో, కలెక్టర్, సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా విన్నవించినా చట్ట ప్రకారంగా చర్యలకు స్థానిక గ్రామ సభ నుంచి నోటీసులు పంపిన వాటిని బేకాతర చేస్తున్నారని స్థానిక అటవి హక్కులు గుర్తింపు కమిటీ గ్రామస్తులు ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని ఆదివాసీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అశ్వారావుపేట మండలం వాగోడ్డుగూడెం గ్రామంలో ఆదివాసీలు సేద్యం చేస్తున్న పోడు భూములలో కంప విత్తనాలు పోస్తున్న ఫారెస్ట్ రేంజర్ అధికారులు మరియు సిబ్బంది. ఆదివాసీలు వేసిన పంటలను ధ్వంసం చేస్తూ పంట మీద కంప విత్తనాలు పోస్తున్నారని ఫారెస్ట్ రేంజర్ మరియు అధికారులను నిలదీస్తున్న క్రమంలో మహిళలు అని చూడకుండా స్థానిక రేంజర్ మరియు వారి సిబ్బంది పెద్ద ఎత్తున మహిళల మీద దాడి చేసి ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ దౌర్జన్యం చేశారని స్థానిక ఆదివాసి మహిళలు ఆరోపిస్తున్నారు. అట్లాంటి అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించిన చర్యలు శూన్యమని అదే విధంగా స్థానిక అధికారులకు చట్టపరంగా పనిచేయాలని కోర్టు సూచించిన వారు పనిచేయడం లేదని కావాలని హక్కు లేనటువంటి ఆంధ్రకు చెందిన అటువంటి ఆదివాసీలను తీసుకుని వచ్చి ఆదివాసీల మీదే పథకం ప్రకారంగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేపిస్తున్నారని వాగొడ్డుగూడెం ఆదివాసీలు అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !