UPDATES  

 పింఛన్ల పంపిణీలో దేశంలోనే అగ్రగామి తెలంగాణ

  • పింఛన్ల పంపిణీలో దేశంలోనే అగ్రగామి తెలంగాణ
  • దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపిన మహాత్ముడు సీఎం కేసీఆర్
  • దివ్యాంగుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు శుక్రవారం జరిగిన ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, పట్టణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ కాఫీల పంపిణీ కార్యక్రమానికి ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4387 మంది దివ్యాంగులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పెరిగిన పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు మండలంలో 826, టేకులపల్లి మండలంలో 631, కామేపల్లి మండలంలో 943, గార్ల మండలంలో 658, బయ్యారం మండలంలో 800, ఇల్లందు మున్సిపాలిటీలో 529 మందికి సంబంధించి మొత్తం 4387 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయటం జరిగిందని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016 పెన్షన్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలు ప్రతిపక్షాలు నివ్వెరపోయేలా ఉన్నాయని, కలలో కూడా ఊహించని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని తెలిపారు. దివ్యాంగులకు పెన్షన్ తో పాటు అవసరమైన పరికరాలను సైతం ప్రభుత్వం పూర్తిసబ్సిడీతో అందిస్తున్నాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఇవే బీఆర్ఎస్ పార్టీకి ప్రధానబలమని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ ఛైర్మెన్ డీవీ, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిదులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !