పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేఅభ్యర్థిత్వానికి ధరఖాస్తు
– పినపాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
– పినపాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోర్సా ఆనంద్
మన్యం న్యూస్, మణుగూరు:
పినపాక నియోజకవర్గం లో నికార్సైన కార్యకర్తల, నాయకుల సమిష్టి కృషితో పాటు, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య గారి ఆశీస్సులతో మరియు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి ఆశీస్సులతో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధిస్తామని, కాంగ్రెస్ యూత్ నాయకులు కోర్సా ఆనంద్ గారు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గాంధీభవన్ కు చేరుకొని పిసిసీ కార్యవర్గ ప్రతినిధులకు దరఖాస్తూ అందజేశారు. రాబోవు 2023 సార్వత్రిక ఎన్నికలలో పినపాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని పిసిసిని అభ్యర్థించారు. తన అప్లికేషన్ ను, బయోడేటాను గాంధీభవన్ లో అందజేశారు.ఈ కార్యక్రమంలో అశ్వారావు పేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కట్రం నరసింహ రావు, పినపాక నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధిని గోవర్ధన్, చెంచల రాము , ఇల్లెందు నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
