UPDATES  

 తహసీల్దార్ నరేశ్ ని సన్మానించిన ఆదివాసీ సేన

 

మన్యం న్యూజ్ ,కరకగూడెం: మండలనూతన తహసీల్దార్ నరేష్ శుక్రవారం ఆదివాసీ సేన అధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శాలువ తో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అనంతరం పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా గృహలక్ష్మి పథకం నూ ప్రభుత్వము మంజూరు చేసే 3,00,000/- రూపాయల నూ ఆరు లక్షలకు పెంచాలని, గ్రామసభల బలోపేతం కొరకు, గిరిజనుల మనుగడ కొరకు చట్టాలనూ పటిష్టంగా అమలు చేయాలని, రైతుల సమస్యలనూ పరిష్కరించాలని, అదేవిధంగా జిల్లాలో మండలం నూ అగ్రగామిగా వుండేలా చర్యలు తీసుకోవాలని , అందుకు కొరకు అవసరమైన సహాయం నూ అందిస్తామని ఆదివాసీ సేన తరుపున తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన రాష్ట్ర కోశాధికారి కొమరం అనిల్, ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వజ్జా జ్యోతి బసు తో పాటు పోలెబోయిన వెంకటనారాయణ, చందా శ్యామ్, పోలేబోయిన రాజు , తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !